ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాందలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుండి వరంగల్‌కు ఇండికా కారులో ఓ కుటుంబం వస్తుంది. ఖమ్మం జిల్లాలోని తిరులాయపాలెం వద్దకు వచ్చిన తర్వాత కారును లారీ ఢీకొట్టింది. కారు, లారీ ఢీ కారణంగా కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ఐదుగురు చనిపోయిన్లుగా సమాచారం. కాగా వారు జూలూరుపాడు మండలం బేతలపాడు గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది.