ఉపపోరుకు జగన్ సన్నద్ధం: ఫిబ్రవరి 1 నుండి 3 వరకు పర్యటన

జగన్ రాజీనామా చేసిన అనంతరం లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్షలు చేపట్టడం, విశాఖలో ఓదార్పు నిర్వహించడం, పెట్టబోయే పార్టీ తదితర బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన అప్పుడప్పుడు జిల్లాలో తన వర్గం నేతలతో భేటీ అవుతున్నారు. ఉప ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, బాబాయ్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెస్ గెలుపుకు తమతమ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కూడా సమయం చూసుకొని నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయానికి వచ్చినట్టున్నారు. 7వ తేదినుండి పోలవరం యాత్ర ప్రారంభమవుతుంది.












Click it and Unblock the Notifications