జగన్ నిందితులను హత్యలు చేయిస్తున్నారు: మోత్కుపల్లి నర్సింహులు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కనుసన్నల్లోనే పరిటాల రవి హత్య జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఇష్టానుసారంగా వ్యవహరించారని, పరిటాల హత్య కేసులో సిబిఐని వైయస్సార్ ప్రభావితం చేశారని వారు విమర్సించారు. అప్పట్లో తాము సిబిఐని తాము విశ్వసించలేదని వారు చెప్పారు. పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడని ఆరోపిస్తూ జగన్ పాత్రపై సిబిఐతో విచారణ జరిపించాలని వారు గవర్నర్‌ను కోరారు.
పరిటాల హత్య కేసులో నిందితుడు జగన్‌ను కాపాడి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు చేశారని, ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని వారన్నారు. జగన్‌ను రక్షించి అతనిపై కేసును ఉపసంహరించుకున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications