ఐదు రోజుల సిబిఐ కస్టడీకి మాజీ మంత్రి, ఆయన అనుచరులు
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ:
2జి
స్పెక్ట్రమ్
కుంభకోణం
కేసులో
నిందితులు
టెలికం
మాజీ
మంత్రి
ఎ
రాజాను,
ఆయన
ఇద్దరు
అనుచరులను
ఐదు
రోజుల
పాటు
సిబిఐ
కస్టడీకి
అప్పగిస్తూ
పాటియాల
హౌస్
కోర్టు
గురువారం
ఆదేశాలు
జారీ
చేసింది.
రాజాను,
టెలికం
మాజీ
కార్యదర్శి
సిద్ధార్థ్
బెహురియా,
వ్యక్తిగత
కార్యదర్సి
ఆర్‌కె
చండోలియాలను
కోర్టు
సిబిఐ
కస్టడీకి
అప్పగించింది.
అంతకు
ముందు
సిబిఐ
అధికారులు
వారిని
పాటియాలా
హౌస్‌లోని
ప్రత్యేక
న్యాయమూర్తి
ఓపి
సైనీ
ముందు
హాజరు
పరిచారు.
విస్తృత
స్థాయిలో
ప్రశ్నించేందుకు
సిబిఐతో
పాటు
ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్
వారిని
తమ
కస్టడీకి
అప్పగించాలని
న్యాయమూర్తిని
కోరాయి.
వారిపై
60
రోజులలోగా
చార్జిషీట్
దాఖలు
చేస్తామని
సిబిఐ
అధికారులు
చెప్పారు.
కాగా,
రాజా
తమకు
సహకరించడం
లేదని,
తమ
ప్రశ్నలకు
సూటిగా
సమాధానం
ఇవ్వడం
లేదని
వారంటున్నారు.