హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉండవల్లిది మిత్రద్రోహం: రాజమండ్రి ఎంపీపై అంబటి రాంబాబు నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత అంబటి రాంబాబు గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనకు మెయిల్ చేసిన లేఖను బయటపెట్టి ఉండవల్లి ఆయనకు మిత్రద్రోహం చేశారన్నారు. ఇంతవరకు బయట పెట్టకుండా ఇప్పుడు బయట పెట్టడం వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. నీవు చేసిన మిత్రద్రోహానికి వైయస్ ఆత్మక్షోభిస్తుందన్నారు. వైయస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిని అని చెప్పుకుంటున్న ఉండవల్లి లేఖ బయటపెట్టడం మిత్రద్రోహం కిందకు వస్తుందన్నారు. వైయస్ అశయం కోసం కాంగ్రెసు‌లోనే ఉంటానని పదేపదే ఉండవల్లి ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వైయస్‌గానీ, ఉండవల్లిగానీ ఎప్పుడైనా కాంగ్రెసు‌ను వీడుదామనుకొని మళ్లీ వెనక్కి తగ్గారా అని ప్రశ్నించారు.

పార్టీలో ఉంటే జగన్ వెంటే ఉండేవాడినని చెప్పారు. కానీ అధిష్టానం ఓదార్పుకు వెళ్లవద్దని చెప్పిన తర్వాత మీరు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వైయస్ కుటుంబం ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. కాబట్టే జగన్ బయటకు వచ్చారన్నారు. జగన్ వెంట మీరు రావాల్సిన అవసరం లేదన్నారు. కానీ వైయస్ ప్రఖ్యాతలను మాత్రం దెబ్బతీయవద్దన్నారు. నేను సోనియాను సైతాన్ అనలేదన్నారు. సైతాన్‌లా జగన్ వెంట పడుతున్నారని చెప్పారు. వైయస్ మరణం తర్వాత సోనియా జగన్‌కు అండగా ఉంటుందనుకున్నానని, అయితే ఆమె జగన్‌ను అడుగడుగునా అడ్డుకున్నదన్నారు. అందుకే ఒకప్పుడు సోనియాపై నాకున్న నమ్మకం పోయిందన్నారు. రోశయ్య తనకు ఏపిఐఐసి చైర్మన్ పదవి ఇవ్వలేదని తాను ఇలా మాట్లాడం లేదన్నారు.

వైయస్ మరణం అనంతరం ఎప్పుడూ నేను జగన్ వెంటే ఉన్నానన్నారు. వైయస్ రెక్కల ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉండటమే మా నైతికత అన్నారు. ప్రభుత్వం 2014 వరకు ఉండాలని మేం అనుకుంటున్నా అప్పటి వరకు ఉండదని ప్రజలు, మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా అనుకుంటున్నారన్నారు. ఉప ఎన్నికలలో కొత్త పార్టీ పేరుమీదనే పోటీ చేస్తామని చెప్పారు. సామాజిక న్యాయమంటూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవికి తన ఒక్కడివల్ల సామాజిక న్యాయం సాధ్యం కాలేదని కాంగ్రెసు‌తో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X