తెలంగాణను అడ్డుకోవడానికే చిరుతో కాంగ్రెసు దోస్తీ: హరీష్ రావు

అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పారు. మాతో పాటు తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు రావాలన్నారు. తెలంగాణ వచ్చే వరకు అసెంబ్లీని స్తంబింపజేస్తామన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టకుంటా అడ్డుకుంటామని చెప్పారు. తమతో ఎమ్మెల్యేలంతా కలిసి రావాన్నారు. ఈనెలలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కూడా ఎంపీలు అడ్డుకోవాలని సూచించారు. సీమాంధ్రులకు లేని హైకమాండ్ కేవలం తెలంగాణవారికే ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. సమావేశాలను అడ్డుకొని ఉద్యమ తీవ్రతను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications