నాసిక్ వద్ద జరిగిన హెలికాప్టర్ క్రాష్‌లో తెలుగు మేజర్ భానుచందర్ మృతి

జోధ్‌పూర్ సైనిక స్థావరానికి చెందిన అతుల్, భానుచందర్‌లు రెండు రోజుల క్రితమే నాసిక్ శిక్షణ కేంద్రానికి వచ్చారని అధికారులు వెల్లడించారు. గోవా-పుణె మార్గంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. త్వరలో బెంగళూరులో నిర్వహించే వైమానిక విన్యాసాల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. విజయనగరం పట్టణం చిన్నవీధికి చెందిన భానుచందర్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్మీ మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన డెహ్రాడూన్‌లోని సైనిక అకాడమీలో శిక్షణ పొందారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో చేరారు. నెల క్రితమే మేజర్‌గా పదోన్నతి పొందారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత, అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులను తుదముట్టించడంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. భానుచందర్‌కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. భానుచందర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలముకుంది.












Click it and Unblock the Notifications