తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె హీరో రాజా, కరుణానిధి బాసట

లక్షలాది మంది ప్రజలకు మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తేవడమే రాజా చేసిన తప్పని, రాజా జైలులో ఉన్నాడని, ప్రజల తరఫున రాజాను అభినందిస్తున్నానని కరుణానిధి అన్నారు. రాజాను కాగ్ తప్పు పట్టినప్పటికీ కరుణానిధి మాత్రం చాలా స్పష్టతతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాను హీరోగా ముందు పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. రాజా మొబైల్ మంత్రం ద్వారా గ్రామీణ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చూసుకునేందుకు కరుణానిధి ప్రయత్నిస్తున్నారు. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్తా నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం గ్రామీణ ఓటర్లపై ప్రభావం చూపదని డిఎంకె వర్గాలంటున్నాయి.
Comments
Story first published: Friday, February 4, 2011, 12:26 [IST]