తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో బండి సంజయ్ తల్లి..కేంద్రమంత్రికి పెద్ద కష్టం!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొడుకుపోక్సో కేసులో ఇరుక్కోవటంతో పాటు, అనేక కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఆయన తల్లి బండి శకుంతలమ్మ ఆకస్మికంగా గుండె సంబంధిత సమస్యకు గురయ్యారు. 75 ఏళ్ల శకుంతలమ్మ మే 15 సాయంత్రం తన స్వగృహంలో ఉన్నప్పుడు గుండెలో తీవ్ర నొప్పితో బాధపడ్డారు.
బండి సంజయ్ తల్లికి గుండె పోటు, ఆస్పత్రిలో చికిత్స
వయసు మరియు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ చైతన్యపురి నివాసం నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకువెళ్ళారు. శకుంతలమ్మను నానక్‌రాంగూడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ గుండె వైద్య నిపుణుల బృందం వెంటనే అత్యవసర పరీక్షలు చేసి, గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టెంట్ అమర్చారు.

తల్లి కోసం హైదరాబాద్ కు బండి సంజయ్
ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో అధికారిక పర్యటనలో ఉన్న బండి సంజయ్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని అత్యవసరంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి ఆరోగ్య వివరాలను కార్డియాలజిస్టులతో వివరంగా అడిగి తెలుసుకున్నారు.
తల్లి పరిస్థితికి బండి సంజయ్ ఆందోళన
తల్లి పరిస్థితి చూసి బండి సంజయ్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు ఆయనకు ధైర్యం చెప్పి, ఆమె త్వరగా కోలుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన కేవలం కుటుంబ సభ్యులనే కాకుండా, కరీంనగర్ జిల్లా ప్రజలు మరియు బీజేపీ నాయకులను కూడా కలవరపెట్టింది.
ఒక పక్క కొడుకు కేసు, మరోవైపు తల్లి ఆరోగ్య ఆందోళనలో బండి సంజయ్
ఒక పక్క కొడుకు కేసు, మరోపక్క ఆస్పత్రిలో తల్లి ఉండటంతో బండి సంజయ్ తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఇటీవలి కాలంలో కుటుంబ సభ్యులపై వచ్చిన వివాదాలు మరియు సోషల్ మీడియా దుష్ప్రచారం కూడా శకుంతలమ్మ ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం తల్లి ఆరోగ్యం మీదే దృష్టి సారించి, ఆమె త్వరగా పూర్తి కోలుకోవాలని కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.













Click it and Unblock the Notifications