చర్లపల్లి-తిరుచానూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఇలా..!

తెలంగాణలోని చర్లపల్లి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి-తిరుచానూరు స్టేషన్ల మధ్య నడుపుతున్న వీక్లీ ఎక్స్ ప్రెస్ (Charlapalli-Tiruchanur Weekly Express)పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ రైలు రెగ్యులర్ గా అందుబాటులోకి రాబోతోంది. దీంతో ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ కు సంబంధించిన షెడ్యూల్, స్టాప్ ల వివరాలను రైల్వేశాఖ తాజాగా విడుదల చేసింది. వీటిని ఓసారి చూద్దాం..

కాకినాడ నుంచి 7 రాష్ట్రాల మీదుగా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! డేట్, హాల్ట్ లు ఇవే..!
కాకినాడ నుంచి 7 రాష్ట్రాల మీదుగా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! డేట్, హాల్ట్ లు ఇవే..!

చర్లపల్లి నుంచి తిరుచానూరుకు వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 17059ను ఈ నెల 17 నుంచి ప్రతీ ఆదివారం నడుపుతారు. ఈ రైలు చర్లపల్లిలో ఆదివారం రాత్రి 9.30కు బయలుదేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 12.30కు ఇది తిరుచానూరు చేరుకుంటుంది. అలాగే తిరుచానూరు నుంచి మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17060 ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూరులో బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Railways Makes Charlapalli Tiruchanur Weekly Express Permanent
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ రెండు రైళ్లకూ మల్కాజ్ గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ రెండు సెకండ్ ఏసీ, 7 ధర్డ్ ఏసీ, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. వీకెండ్ లో చర్లపల్లి నుంచి తిరుపతి దర్శనానికి వెళ్లి మరుసటి రోజు తిరిగి రావాలనుకునే వారికి ఈ రైళ్లు ఇకపై రెగ్యులర్ గా అందుబాటులో ఉండబోతున్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+