చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..!
వేసవి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అసలే వేసవి ఉక్కపోత, మరోవైపు రైళ్లలో రద్దీ ప్రయాణికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి (charlapalli) నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు (special trains) నడుపుతోంది. ఇదే క్రమంలో చర్లపల్లి నుంచి ఒడిశాలోని షాలిమార్ కు ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటికి సంబంధించి వివరాలను విడుదల చేశారు.
ఈ నెల 4వ తేదీ నుంచి జూన్ 27 వరకూ చర్లపల్లి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా చర్లపల్లి నుంచి షాలిమార్ కు ఈ నెల 4వ తేదీ నుంచి జూన్ 27 వరకూ ప్రత్యేక రైళ్లు ( రైలు నంబర్ 08046 ) నడపనున్నారు. ఈ రైళ్లు ఉదయం 6.55కు చర్లపల్లిలో బయలుదేరి తెలుగు రాష్ట్రాల మీదుగా మరుసటి రోజు ఉదయం 11.15కు ఒడిశాలోని షాలిమార్ కు చేరుకుంటాయి.

అలాగే షాలిమార్ నుంచి అర్ధరాత్రి 12.30కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు (రైలు నంబర్ 08045) తర్వాతి రోజు తెల్లవారు జామున 4.30కు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు రెండు వైపులా తెలుగురాష్ట్రాల్లో కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే వీటిలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, క్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.












Click it and Unblock the Notifications