విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..!
ఏపీలోని విశాఖపట్నం (visakhapatnam) నుంచి తెలంగాణలోని చర్లపల్లికి రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలులో తూర్పు కోస్తా రైల్వే మార్పు చేసింది. ఇప్పటివరకూ ప్రత్యేక రైలుగా నడుపుతున్న ఈ ఎక్స్ ప్రెస్ ను కాస్తా రెగ్యులర్ రైలుగా మార్చింది. ఈ మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది, హాల్ట్ లు ఎలా ఉంటాయి, ఏయే కోచ్ లు ఉంటాయన్న వివరాలను తూర్పు కోస్తా రైల్వే విడుదల చేసింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు (నం.18527)ను ఏప్రిల్ 3 నుంచి రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చారు. ప్రతీ శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖకు నడుపుతున్న మ్యాచింగ్ రైలు (నం.18528)ను కూడా రెగ్యులర్ సర్వీస్ గా మార్చారు. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రైళ్లకూ 12 హాల్ట్ లు ఇచ్చారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేటలో హాల్ట్ లు ఇచ్చారు. విశాఖలో సాయంత్రం 5.30కు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అలాగే చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30కు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 5.20కు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ నాలుగు జనరల్ కోచ్ లు, ఆరు స్లీపర్ కోచ్ లు, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ లు 4, సెకండ్ ఏసీ కోచ్ 1, ధర్డ్ ఏసీ కోచ్ 1 ఉంటాయి. వీటితో పాటు దివ్యాంగుల కోచ్ కూడా ఉంటుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications