చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!
తెలంగాణలోని చర్లపల్లి (charlapalli) నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశాలోని షాలిమార్ (Shalimar)కు కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (amrit bharat express)ప్రారంభానికి రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలుకు హాల్ట్ లు, ఇతర వివరాలను తూర్పు కోస్తా రైల్వే జోన్ విడుదల చేసింది. అలాగే ఈ రైలు ఏయే రోజుల్లో అందుబాటులో ఉంటుందన్నదీ అధికారులు వెల్లడించారు.
చర్లపల్లి నుంచి షాలిమార్ కు ప్రతీ మంగళవారం అమృత్ భారత్ రైలు నంబర్ 17065 ప్రయాణించబోతోంది. ఈ రైలును ఏప్రిల్ 7న అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతీ మంగళవారం చర్లపల్లిలో ఉదయం 6.55కు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 11.20కు షాలిమార్ కు చేరుకోనుంది. అలాగే షాలిమార్ నుంచి చర్లపల్లికి మరో అమృత్ భారత్ రైలు నంబర్ 17066 ప్రతీ బుధవారం అందుబాటులోకి వస్తోంది. ఈ రైలు షాలిమార్ లో ప్రతీ బుధవారం మధ్యాహ్నం 12.50కు బయలుదేరి గురువారం సాయంత్రం 7గంటలకు చర్లపల్లి చేరుకోనుంది.

ఈ రెండు రైళ్లకూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ స్టాప్ ల వివరాలను తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. చర్లపల్లి నుంచి మొదలయ్యే ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు (విజయవాడ) స్టేషన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బాలాసోర్, సంత్రగచ్చి, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్ పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, ఖరగ్ పూర్ మీదుగా షాలిమార్ చేరుకోనుంది. ఈ రైళ్లలో 8 స్లీపర్ కోచ్ లతో పాటు 11 జనరల్ బోగీలు ఉంటాయి.












Click it and Unblock the Notifications