తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా, 165 మందితో కార్యవర్గం
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతిని ఎన్నుకున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ శాసనసభ స్పీకరు ప్రతిభా భారతి శుక్రవారం చెప్పారు. తెలుగు మహిళ కార్యవర్గాన్ని ఆమె ప్రకటించారు. శోభా హైమావతిని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మొత్తం 165 మందితో తెలుగు మహిళా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
కార్యవర్గంలో 12 మంది ఉపాధ్యక్షురాళ్లు, 9మంది ప్రధాన కార్యదర్శులు, 32మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 10మంది ప్రచార కార్యదర్శులు, 58మంది కార్యదర్శులు, 39మంది కార్యవర్గ సభ్యలతో ఏర్పాటు చేశారు.