15 మంది భారతీయుల రహస్య ఖాతాలను వెల్లడించిన తెహెల్కా
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ:
పన్ను
ఎగవేయడానికి
వీలున్న
లీచెన్‌స్టీన్
బ్యాంకులో
రహస్య
ఖాతాలున్నాయని
అనుమానిస్తున్న
15
మంది
భారతీయుల
పేర్లను
తెహెల్కా
పత్రిక
విడుదల
చేసింది.
గురువారం
విడుదలైన
ఆ
పత్రిక
సంచికలో
వారి
వివరాలు
ఉన్నాయి.
ఈ
జాబితాను
2009
మార్చిలో
భారత
ప్రభుత్వానికి
అందజేశారు.
గోప్యతా
నిబంధనలపై
జర్మనీ
ప్రభుత్వం
ఆ
జాబితాను
అందజేయడంతో
భారత
ప్రభుత్వం
వెల్లడించలేదు.
జాబితాలో
ఉన్న
వ్యక్తులపై
ప్రత్యక్ష
పన్నుల
కేంద్ర
సంస్థ
చేపట్టిన
దర్యాప్తు
తుది
దశలో
ఉన్నట్లు
తెలుస్తోంది.
ఆదాయం
పన్నున
చట్టం
కింది
వివిధ
నిబంధనల
కింద
వారిని
ప్రాసిక్యూట్
చేసే
అవకాశాలున్నాయి.
తెహెల్కా
విడుదల
చేసిన
జాబితాలో
12
మంది
వ్యక్తుల
పేర్లు,
మూడు
ఫౌండేషన్ల
పేర్లు
ఉన్నాయి.
తెహెల్కా
విడుదల
చేసిన
పేర్ల
జాబితా
-
మనోజ్
దూపేలియా,
రూపాల్
దుపేలియా,
మోహన్
దూపాలియా,
హస్ముఖ్
గాంధీ,
చింతన్
గాంధీ,
దిలీప్
మెహతా,
అరుణ్
మెహతా,
గుణవతి
మెహతా,
రజనీకాంత్
మెహతా,
ప్రబోధ్
మెహతా,
అశోక్
జైపూరియా,
రాజ్
ఫౌండేషన్,
ఊర్వశి
ఫౌండేషన్,
అంబ్రునోవా
ట్రస్టు.
తాము
వీరిని
సంప్రదించడానికి
ప్రయత్నించామని,
వారి
నుంచి
స్పందన
రాలేదని,
దీంతో
ఆ
పేర్లు
ఇచ్చామని
తెహెల్కా
చెప్పింది.
ఇండియన్
కార్పోరేషన్
చైర్మన్
పేరు
కూడా
జాబితాలో
ఉందని,
అయితే
ఆయన
నుంచి
పూర్తి
వాదన
కోసం
చూస్తున్నామని,
దాంతో
ఆయన
పేరు
ఇవ్వలేదని
తెహెల్కా
వివరించింది.
తాజా
పరిణామాలతో
వివాదాస్పదమైన
కొచ్చి
ఐపియల్
ఫ్రాంచైజీ
తీవ్రమైన
ఇబ్బందుల్లో
పడినట్లు
తెలుస్తోంది.
కొచ్చి
ఐపియల్
ఫ్రాంచైజీలో
12
శాతం
వాటా
ఉన్న
రోజీ
బ్లూ
యజమాని
హర్షద్
మెహతాపై
భారత
ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్
దర్యాప్తు
చేస్తున్నట్లు
హెడ్‌లైన్స్
టుడే
తెలిపింది.