షబ్బీర్ అలీ పై AICC సీరియస్, అనూహ్య నిర్ణయం..!?

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యవహారం పైన వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారం పార్టీ హైకమాండ్ వద్దకు చేరింది. దీంతో, ఇప్పుడు ఏఐసీసీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఏఐసీసీ నిశితంగా గమనిస్తోంది. దక్షిణాది పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన పార్టీ అధినాయకత్వం.. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టింది. ఇండియా కూటమి తదుపరి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన సీరియస్ గా స్పందిస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పై పార్టీ సీరియస్ అయింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్‌లో చర్చకు తీసుకురావడంపై కూడా అసంతృప్తి చెందారు. ఈ మేరకు షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు పంపారు. తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్లు తెలుస్తోంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.

మీనాక్షీ కోసం తెలంగాణ ఎంపీ రాజ్యసభ సీటు త్యాగం..!?
మీనాక్షీ కోసం తెలంగాణ ఎంపీ రాజ్యసభ సీటు త్యాగం..!?
aicc-notices-for-telangana-congress-leader-shabbir-ali-over-latest-controversy-becomes-big-debate-in

వ్యాఖ్యల వైరల్.. నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వైరల్ అయిన ఆడియోలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్‌లో చర్చకు తీసుకురావడంపై కూడా ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. కామారెడ్డి కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో సొంత పార్టీ నేతలపై విమర్శలు, దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+