తెలంగాణ బస్సుయాత్రపై ఉద్రిక్తం: జగ్గారెడ్డి అనుచరుడిపై జెఏసి దాడి

కాగా వరంగల్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరు బహిష్కరించాలని జిల్లా తెలంగాణవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వారు ఇంటింటికి తిరిగి వినతి పత్రాలు అందించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లడంతో ఆయన అక్కడ లేరు. అయితే వారు గేటుకు ఆ కరపత్రాన్ని ఉంచి వచ్చారు. 9వ తారీఖున వరంగల్‌లో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రద్దు చేసుకోవాలని కోరారు. లేదంటే అందరూ అడ్డుకుంటారని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications