హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి ఊహించని పదవి, వెయిట్ అండ్ సీ: పిసిసి చీఫ్ డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో చిరంజీవికి ఊహించని పదవి వస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మంగళవారం అన్నారు. సస్పెన్షన్ వీడే వరకు అందరూ వేచి ఉండవలసిందేనన్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేసినందువల్ల రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు‌కు మరింత బలం పెరిగిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిరు ఇమేజ్‌కు తగ్గ పదవి కాంగ్రెసు పార్టీలో ఉంటుందన్నారు. పార్టీ చిరంజీవిని గుర్తించిందని చెప్పారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తనతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నారన్నారు. గీత గీసే సమయం వస్తే వారు కాంగ్రెసు పార్టీ వైపే ఉంటుందని చెప్పారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాబట్టి ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంగానే వారు జగన్ వెంట వెళుతున్నారని చెప్పారు. కాగా డిఎస్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

English summary
PCC chief D Srinivas said Chiranjeevi will get unbelievable post in Congress. DS said now Congress has double its strength with PRP merger. DS said MLA's who went with Jagan, they all are in touch with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X