హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానులకు చిరు హామీ, విలీనంపై వివరణ: పవన్ భేటీ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: అభిమానులకు రాజకీయంగా సరియైన ప్రాధాన్యత కల్పిస్తానని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తన అభిమానుల హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌ పార్టీలో విలీనం చేయడానికి గల కారణాలను వివరించేందుకు చిరంజీవి హైదరాబాదుకు తన అభిమాన సంఘాలను పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమాన సంఘాలను, చిరంజీవి యువతను విలీనం చేశారు. యువతను బలీయమైన శక్తిగా రూపొందిద్దామని ఆయన వారికి సూచించారు. ఒక నది ప్రవాహంలో వెళ్లి వీలు చూసుకొని చేరాల్సిన చోటుకు చేరుదామని సూచించారు. కాంగ్రెసు‌లో విలీనం పట్ల చిరు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన తన అభిమాన సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి సుమారు 400 మంది అభిమానులు హాజరయ్యారు. చిరంజీవి అభిమానులకు కాంగ్రెసు‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడానికి గల కారణాలను వివరించినట్లు తెలిసింది. చిరంజీవితో అభిమానులు కూడా ఏకీభవించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని తాము వ్యక్తిగతంగా అభిమానిస్తున్నందున పార్టీలతో సంబంధం లేదని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే మేం ఉంటామని కూడా అభిమానులు చెబుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ తన అభిమానులతో ఏర్పాటు చేయాల్సిన సమావేశం వాయిదా పడింది.

English summary
Megastar Chiranjeevi clarrifed to his fans about PRP merger issue on Friday meeting. He promised them on political opportunities. He also merged Chiranjeevi Yuvatha and fans association in Congress. about 400 fans were attended to this meeting. Pawan Kalyan's meeting is postponed, to be held today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X