రాజమండ్రి: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి చెందిన ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ నేత జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని ఖండించారు.
చిరుతో పాటు కాంగ్రెస్ వెళ్లడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయనట్లు సమాచారం. పీఆర్పీ విలీనం కారణంగా ఆయన జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆయన జగన్‌తో కూడా మాట్లాడారు.
PRP leader Jyothula Nehru disappointed very much about Chiranjeevi decision to PRP merge in Congress. He is opposing merger. So, he is ready to go with Ex MP YS Jaganmohan Reddy.