టిఆర్ఎస్ విలీనంపై సోనియానే కల్పించుకోవాలి: మధు యాష్కీ

శ్రీకృష్ణ కమిటీ కేవలం సంప్రదింపుల కమిటీ మాత్రమేనని చెప్పారు. కేవలం అనుమానాలు నివృత్తి చేయడానికి మాత్రమే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 14న తెలంగాణ పార్టీకి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలు కోర్ కమిటీతో భేటీ అవుతారని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మధుయాష్కీ శుక్రవారం ఉదయం బ్రిటన్ హై కమిషనర్‌తో హైదరాబాదులో భేటీ అయ్యారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించుకున్నారు.












Click it and Unblock the Notifications