హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ జట్టు సత్తా ఎంత, ఇతర పార్టీలను ఎదుర్కోగలదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీని స్థాపించడానికి సమాయత్తమవుతున్న తరుణంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ జట్టు సత్తా ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ వెంట వచ్చే నాయకులు ఇంకా కాంగ్రెసులో చాలా మంది ఉన్నారని జగన్ వర్గం నాయకులు పదే పదే చెబుతున్నారు. కానీ, దాదాపుగా జగన్ జట్టు ఖాయమైనట్లే కనిపిస్తోంది. కాంగ్రెసు నుంచి ఇక పెద్దగా బలమైన నాయకులు జగన్ వైపు చేరే అవకాశాలు లేనట్లేనని చెప్పవచ్చు. పైగా, బలమైన గొంతుతో ప్రత్యర్థులపై విరుచుకుపడే శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న జట్టుతోనే వైయస్ జగన్ సర్గుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం జగన్ వెంట ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే ఉన్నారు. వీరే వైయస్ జగన్ పార్టీలో ప్రథమ శ్రేణి నాయకులు అవుతున్నారు. ఒక రకంగా వీరికి వైయస్ జగన్ ద్వారా మంచి అవకాశం లభించినట్లే. మాజీ మంత్రులు, మాజీ శాససభ్యులు మాత్రం మరింత మంది వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కానీ అది వైయస్ జగన్‌కు పెద్దగా ఉపయోగపడేది కాదు. పైగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో సీమాంధ్రలో పరిస్థితి మారిపోయింది. ఇది వైయస్ జగన్‌కు ఇబ్బందికరమే. కోస్తాంధ్రలోని కాపులు దీంతో వైయస్ జగన్ వెంట నడిస్తారా అనేది అనుమానమే.

కోస్తాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన అంబటి రాంబాబు గానీ రాయలసీమకు సమన్వయకర్తగా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి గానీ తమ సత్తాతో పార్టీకి బలం చేకూర్చగలుగుతారనేది అనుమానంగానే ఉంది. తెలంగాణలో గోనె ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, రెహ్మాన్ ఆయా జిల్లాల్లో బలాన్ని సమీకరించగలరా అనేది కూడా సందేహమే. దాదాపుగా అన్ని జిల్లాల పరిస్థితి అదే విధంగా ఉంది. ఈ నాయకుల వెనక నడిచేందుకు సీనియర్లు ఇష్టపడకపోవచ్చు. తాము జగన్ పార్టీలోకి వస్తే తమకన్నా ఎంతో జూనియర్లు, బలం లేనివారు అయిన నాయకుల కింద పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో సీనియర్లు, సమర్థులు వెనక్కి తగ్గవచ్చు. అయితే, జగన్ వర్గం మాత్రం వైయస్సార్‌పై ప్రజల్లో ఉన్న అభిమానమే తమను గట్టెక్కిస్తుందని నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఏమైనా, జగన్ జట్టుకు అంతా సత్తా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇది జగన్‌కు తీవ్రమైన ఇబ్బందులే తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు.

English summary
A debate is going on about the strength of YS Jagan's team. Most of the leaders backing Jagan are second and third grade leaders in politics. They may not work competitively with other party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X