హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరికీ భయపడేది లేదు: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించే విషయంపై ఎవరికీ భయపడేది లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తలపెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. శాసనసభలో తాము బలాన్ని నిరూపించుకుంటామని, తమకు అనుకూలంగా 183 ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై తెలుగుదేశం వైఖరి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. వేరే పార్టీ గురించి తాను ఎందుకు మాట్లాడాలని, తమ గురించి ఏమైనా చెప్పగలనని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే పది శాతం సభ్యుల మద్దతు కావాలని, తెరాసకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని, ప్రతిపాదన దశలోనే అది వీగిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఎవరు అవిశ్వాసం ప్రతిపాదించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సహాయ నిరాకరణ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యోగులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
PCC president D Srinivas said that Congress will not fear about no confidence against CM Kiran Kumar Reddy. He said that his government will face no confidence any time. He rejected to comment on TDP role regarding no confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X