కేవలం గ్లామర్ కోసమేనా?: స్పోర్ట్స్ సినిమాలో ఈ హాట్ షో ఏంటి సామీ?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మోస్ట్ అవేటెడ్ సినిమా 'పెద్ది' ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్, మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఊహించని విధంగా ఈ ట్రైలర్ చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ వైపు మళ్లింది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కేవలం గ్లామర్ కోసమే వాడుకునే పాత ట్రెండ్ ను ఈ సినిమాలోనూ కంటిన్యూ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రైలర్‌లో రామ్ చరణ్‌ను క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడే రఫ్ అండ్ అగ్రెసివ్ అథ్లెట్‌గా చూపించారు. సినిమా చాలా గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ.. జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ను ప్రెజెంట్ చేసిన విధానం కథలోని ఎమోషన్‌కు కాస్త దూరంగా ఉన్నట్లు అనిపించిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జాన్వీ పాత్రను విపరీతమైన గ్లామర్ యాంగిల్‌లోనే చూపించారని, ఆ అందాల రచ్చ ఒక సీరియస్ స్పోర్ట్స్ డ్రామాకు కాస్త అతకనట్లుగా ఉందనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Peddi Movie Trailer Janhvi Kapoor Glamour Show Sparks Hyper-Sexualization Debate Full Details

దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. "ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. ఆఫ్‌స్క్రీన్‌లోనే ఆమె విపరీతంగా గ్లామర్ షో చేస్తుండటంతో ఆన్‌స్క్రీన్‌లో కూడా ఆమెను కేవలం ఐ-క్యాండీ రోల్స్‌కు పరిమితం చేస్తే పెద్దగా ఎగ్జైట్‌మెంట్ ఉండదని కామెంట్లు పెడుతున్నారు. పాతకాలపు తెలుగు సినిమాల్లో లాగే హీరోయిన్లను కేవలం సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, స్లో-మోషన్ విజువల్స్ కోసమే వాడుకుంటూ, కథలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.

ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ.. ట్రైలర్‌పై ఓవరాల్‌గా అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ మేకోవర్, విలేజ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజువల్స్, ఎమోషనల్ ఇంటెన్సిటీ చాలా రిచ్‌గా ఉన్నాయి. అయితే కొందరు మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాల్సిందని, కథలో స్లో-మోషన్ షాట్స్ ఎక్కువయ్యాయని, ఇదివరకు చూసిన కొన్ని స్పోర్ట్స్ డ్రామాలను ఇది గుర్తుచేస్తోందని నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నారు.

స్పోర్ట్స్ అండర్‌డాగ్ స్టోరీలలో గ్లామర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే కథలోని సహజత్వం దెబ్బతినే ప్రమాదం ఉందనే వాదన ఒకవైపు ఉన్నప్పటికీ.. మన తెలుగు కమర్షియల్ సినిమాలో గ్లామర్, రొమాన్స్, హీరో ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. కాబట్టి ఇది బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్లను దెబ్బతీసే అవకాశం చాలా తక్కువ. ఈ చిత్రం జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ముందు జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+