బిల్లు పెట్టకుంటే ఈజిప్టు తరహా ప్రజా ఉద్యమం: ఎంపీ మధు యాష్కీ
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టకపోతే ఈజిప్టు తరహా ప్రజా ఉద్యమం వస్తుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మంగళవారం హెచ్చరించారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ 500 మంది లాయర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. దీనికి ఎంపీ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని కొందరు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. అది సరికాదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తమకు పదవులు తృణపాయమన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన సహాయ నిరాకరణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. సహాయనిరాకరణకు మద్దతు తెలుపని వారు తెలంగాణ ద్రోహులవుతారని చెప్పారు.
తెలంగాణ కోసం అందరం కలిసి శాంతియుతంగా పోరాడుదామని సూచించారు. ఉద్యమంలో హింసకు తావు ఉండకూడదన్నారు. తెలంగాణ తప్ప మాకు ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రకటించకుంటే త్వరలో రాజకీయ సంక్షోభం తప్పదని హెచ్చరించారు.
MP Madhu Yashki warned Central Government, they will take up Egypt type agitations, If Telangana bill will not be proposed in Parliament budget session. He supported JUDA's dharna at Jantar Mantar in New Delhi today.
Story first published: Tuesday, February 15, 2011, 14:24 [IST]