హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ గొడవ: మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాసనసభలో గురువారం చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. శానససభలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన మంత్రులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రత్యామ్నాయాలపై కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి తగిన విధంగా సమాయత్తం కావాలని ఆయన మంత్రులకు సూచించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా అనే విషయానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.

బొత్స సత్యనారాయణ, మాణిక్య వరప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కె. జానా రెడ్డి, రఘువీరా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, దానం నాగేందర్, ఆనం రామనారాయణ రెడ్డి, గీతారెడ్డి, డికె అరుణ, వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి తదితర మంత్రలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 23వ తేదీన ప్రతిపాదించే బడ్జెట్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కిరణ్ కుమార్ రెడ్డి వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

English summary
CM Kirankuamr Reddy held meeting with ministers to discuss strategy to be adapted in Assembly procedings, Botsa Satyanarayana, DK Aruna, Sabitha Ibdra Reddy and other ministers attended the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X