వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశ్వాసంతో అడుగులు: ప్రణబ్‌తో భేటీ అయిన తెలంగాణ ఎమ్మెల్యేలు

తెలంగాణ అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి కదలబోమని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు 30 మంది ఢిల్లీలో మకాం వేశారు. వారు పార్టీ అధిష్టానానికి చెందిన కోర్ కమిటీ సభ్యులతో సమావేశమవుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాము సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీలతో సమావేశమైనట్లు, తమ మనోభావాన్ని సోనియాకు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.