జగన్ దీక్ష దీక్ష చేస్తున్నాడా, ఎక్కడ, ఎప్పుడు, తెలియదే: బొత్స

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాత బకాయిలు కూడా అణాపైసలతో చెల్లిస్తామని బొత్స చెప్పారు. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయన్నారు. వైఎస్ ఉన్నా, రోశయ్య ఉన్నా, కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నా కాంగ్రెస్ విధానాలు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటాయన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక్క విద్యార్థికీ నష్టం కలుగకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టిడిపి మాత్రం ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను నీరుగార్చిందన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే వాటిని చంద్రబాబునాయుడు నీరుగార్చారన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని చంద్రబాబు విరమించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications