వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఖాయం, మా లక్ష్యం నెరవేరింది: టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర హోంమంత్రి చిదంబరం, జనార్ధన్ ద్వివేది తదితరులతో భేటీ ఆయ్యామని వారంతా తెలంగాణకు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో కోర్ కమిటీలో తెలంగాణపై చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. కోర్ కమిటీ ద్వారా గత వాగ్ధానాలు నెరవేర్చుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ తెలంగాణపై స్పష్టమైన హామీ ఇచ్చినందువల్లే తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అఖిలపక్షం నిర్వహిస్తామని చిదంబరం చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత కేంద్రం ఏకాభిప్రాయానికి వస్తుందని అన్నారు.