హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ చెప్పరాని మాటన్నారు, చర్యలుండవా: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తమను చెప్పరాని మాటన్నారని అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తమపై అసభ్య పదజాలం వాడిన గవర్నర్‌పై చర్యలుండవా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. నోటితో ఉచ్చరించ మాటలతో తమను గవర్నర్ తిట్టారని ఆయన చెప్పారు. గవర్నర్ మెప్పు పొంది తన కుర్చీని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమపై చర్యలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. తనకు చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రపతి పాలన వస్తుందని భయపడి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్‌ను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన కుర్చీ కోసం ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలు న్యాయం చేయాలని అడుగుతున్నారని, కాంగ్రెసు తన మాట నిలబెట్టుకోవడం లేదని అడుగుతున్నారని, ఈ స్థితిలో తెలంగాణ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయినా తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన చెప్పారు. గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదవ అధ్యాయం గవర్నర్ ఆలోచనల మేరకే రూపుదిద్దుకుందని, అందుకే బయటపెట్టడం లేదని ఆయన అన్నారు.

గవర్నర్‌ను రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌ను తెలంగాణలో అడ్డుకుంటామని, నరసింహన్‌ను వెనక్కి పంపేవరకు వదిలేది లేదని ఆయన అన్నారు. తమను నోటితో చెప్పలేని మాటన్న గవర్నర్‌పై కేసు ఎందుకు పెట్టరని ఆయన అడిగారు. గవర్నర్ తన పరిధి దాటి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

గవర్నర్ విశ్వవిద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మార్చారని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను అణచేసేందుకు తెలంగాణ గొంతు నొక్కుతున్నారని ఆయన అన్నారు. కేసులు పెట్టినా, సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగబోదని ఆయన అన్నారు. ప్రభుత్వం దొంగలా పారిపోయిందని ఆయన అన్నారు.

English summary
TRS MLA suspended from Assembly, Harish Rao accused Governor Narasimhan that he use unruly langauge against TRS MLAs. He demanded action against Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X