జగన్ ఫీజు పోరు దీక్ష ఎఫెక్ట్: రీయింబర్స్‌మెంట్స్‌పై దిగొచ్చిన ప్రభుత్వం

గత సంవత్సరం 2100 కోట్ల రూపాయలు చెల్లిస్తే, ఈ సారి 3300 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఉన్నాయని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ఏప్రిల్, మేలోగా 25శాతం బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. త్వరలో ఫీజులు విడుదల చేస్తామన్నారు. అందుకు ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఒప్పుకున్నాయని చెప్పారు. ప్రభుత్వం బకాయిలి విడుదలకు సిద్ధపడటంతో ఇంజినీరింగ్ కళాశాలలు ఈ నెల 24 నుండి విడుదల చేయాలనుకున్న కళాశాలల మూసివేతను విరమించుకోనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.