టీఆర్ఎస్ తీరుపై ఆద్వానీ అసంతృప్తి: సీమాంధ్రులను కలుపుకు వెళ్లాలని సూచన

తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందని, బిజెపి మూడు రాష్ట్రాలను ప్రకటించినప్పుడు ఎలాంటి దాడులకు ఆస్కారం లేదని, ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అక్కడివారు సాధించుకున్నారని, అయితే తెలంగాణ ఎమ్మెల్యేలు ఇలాంటి దాడికి పూనుకొనడం సరికాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో పోరాడాలని, సీమాంధ్ర ప్రజలను వ్యతిరేకించడం సరికాదని, వారిని కలుపుకొని వెళ్లాలని, ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తించవద్దని వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. దాడులతో ఉద్యమం నీరుగారుతుందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని ఆయన వారికి సూచించారు. వ్యతిరేక దృక్ఫతంతో ఉద్యమాలు చేయకూడదని, అలా అయితే ఇబ్బందులు వస్తాయని, సీమాంధ్రులను కలుపుకొని వెళ్లి ఉద్యమించండని అని వారికి సూచించారు.
2014లో బిజెపి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇస్తుందని కానీ రెండువైపుల ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు మాత్రం గురి చేయవద్దని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారు వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని చెప్పారు. సహాయ నిరాకరణ గూర్చి కూడా ప్రశ్నించగా సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు ఉందని వారు చెప్పారు. కాగా టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ అద్వానీ అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన పుట్టిన రోజు కారణంగా రాలేక పోయారు. దీనిని ఎమ్మెల్యేలు అద్వానీకి చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications