ఐఎఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్‌లే ఆంధ్ర మావోయిస్టుల పాత్ర?
National
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఐఎఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్ కథ నడిపింది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టులేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినీల్ కృష్ణనుఒరిస్సాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో కిడ్నాప్ చేసి ఏడు డిమాండ్లు పెట్టారు. తమ డిమాండ్లను తీర్చడానికి వారు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. మావోయిస్టులు తెలుగువారిని మధ్యవర్తులుగా పంపాలని, తెలుగు ప్రాంతానికి చెందిన తమ సహచరుల విడుదలకు డిమాండ్ చేయడాన్ని బట్టి ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోరుకొండ దళానికి చెందిన ఎపి నారాయణ అలియాస్ నరేందర్ ఐఎఎస్ అధికారి కిడ్నాప్‌నకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌నకు గురైన ఐఎఎస్ అధికారి ఒరిస్సా క్యాడర్‌కు చెందినవారే అయినా ఆయన తెలుగువాడు కావడం విశేషం. వినీల్ కృష్ణ విజయవాడకు చెందినవాడు. ఆయన కుటుంబం మాత్రం చాలా కాలంగా హైదరాబాదులో ఉంటోంది.
కాగా, ఒరిస్సా ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య మధ్యవర్తులుగా పనిచేయడానికి తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్ఎస్ రావు హైదరాబాదు నుంచి బయలుదేరుతున్నారు. అయితే, మావోయిస్టులు గడువు పెంచాలని హరగోపాల్ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా కొంత దిగిరావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మావోయిస్టుల డిమాండ్ల పరిష్కారానికి ఒరిస్సా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన చెప్పారు. మావోయిస్టుల్లో కొందరిని చట్టపరిధిలో విడుదల చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన తమ సహచరులు సుదర్శన్, రామకృష్ణ భార్య పద్మక్క, గంటి ప్రసాద్‌లను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
వినీల్ కృష్ణ కిడ్నాప్‌లో గాజర్ల రవి, దుబాయ్ శంకర్ వంటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, డెడ్‌లైన్ పెంచాలని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మావోయిస్టులను కోరారు.
It is said that Moists from Andhrpradesh had played main role in kidnapping IAS officer Vineel Krishna in Orissa State.
Haragopal and RS Rao are going to Orissa to mediate between Government and Maoists to get release of Vineel
Krishna.
Story first published: Friday, February 18, 2011, 16:47 [IST]