తెలంగాణ కోసం టిడిపి, టిఆర్ఎస్ పట్టు: సభ రేపటికి వాయిదా

కాగా సభ వాయిదా పడిన అనంతరం టిఆర్ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తీర్మానం కోసం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుంటే, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. విద్యార్థుల చలో అసెంబ్లీ కార్యక్రమం ర్యాలీపై లాఠీఛార్జ్ చేయడం శోచనీయం అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టే వరకు సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు అండగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు.