హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో చంద్రబాబుతో మంత్రి దానం నాగేందర్ మాటకు మాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ స్పీచ్‌ను అడ్డుకున్న ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభ్యులను సస్పెండ్ చేయడం సభాపతికి ఉన్న హక్కు అని, అయితే వివరణ ఇచ్చుకునే హక్కు కూడా సభ్యుడికి ఉందన్నారు. సభ్యుడి వివరణ వినకుండానే సస్పెన్షన్ వేయడం విచారకరమని అన్నారు. వారిపై చేసిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి దానం నాగేందర్‌కు, చంద్రబాబుకు మాటకు మాట వివాదం చెలరేగింది. క్షమాపణ చెప్తేనే శాసనసభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని దానం నాగేందర్ ఆయన అన్నారు.

తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ నాగం జనార్ధన్ రెడ్డి సైతం టిఆర్ఎస్, టిడిపి ఎమ్మెల్యేలపై వేసిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారి వాదనలు వినకుండా సస్పెన్షన్ చేయడం ఏమిటని మీడియా పాయింట్ వద్ద ప్రశ్నించారు. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలలో బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. సహాయ నిరాకరణను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో అందరూ సహాయ నిరాకరణకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

English summary
TDP president Chandrababu Naidu demanded government today withdraw suspension on five MLAs who are suspended by Deputy Speaker Nadendla on saturday. Nagam also demanded to withdraws suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X