తలలు ఎక్కడ పెట్టుకుంటారు: కాంగ్రెసును ప్రశ్నించిన నాగం
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేదని, ఇక తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఏ ముఖం పెట్టుకుని శానససభకు వస్తారని, సిగ్గుసెరం ఉంటే శాసనసభకు రావద్దని, ఒకవేళ వస్తే తెలంగాణపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగులు చేస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. దానిపై చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై శాసనసభలో చర్చించరా అని ఆయన అడిగారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని అంటున్న కాంగ్రెసు శాసనసభ్యులు ఏ ముఖం పెట్టుకుని శాసనసభకు వస్తారని ఆయన అడిగారు. తాము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల సంగతి తేలాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు, న్యాయవాదుల అరెస్టును ఖండించారు. రేపు, ఎల్లుండి తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆయన మద్దతు ప్రకటించారు.
TDP Telangana forum convenor Nagam Janardhan Reddy lashed out at Congress Telangana region MPs and MPs. He demanded Congress Telangana MPs to region for Telangana cause.
Story first published: Monday, February 21, 2011, 16:10 [IST]