రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదల వీడాలి: ఎమ్మెల్యే కెటిఆర్

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. విద్యార్థుల ఛలో అసెంబ్లీని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. చదువుకునే విద్యార్థులపో రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ అంశంపై మొండివైఖరి విడనాడాలి అని కోరారు.












Click it and Unblock the Notifications