చంద్రబాబు వైఖరిపై సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేల అసంతృప్తి

శాసనసభలో తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దీంతో శాసనసభ అర్థాంతరంగా వాయిదా పడుతోంది. ఈ స్థితిలో సభ జరుగుతున్న తీరు పట్ల తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు తీర్మానం ప్రతిపాదించాలని వారు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరాలని ఆలోచిస్తున్నారు. అయితే పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా డిప్యూటీ స్పీకర్‌కు ఆ విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.