హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు వద్దు: మంత్రి సారయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baswaraj Saraiah
హైదరాబాద్: గత డిసెంబర్ 9వ తేదిన కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంభం ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేం లేఖ రాస్తామని బిసి సంక్షేమ శాఖా మంత్రి బస్వరాజ్ సారయ్య బుధవారం అన్నారు. ఉస్మానియాలో పోలీసుల అమానుష ప్రవర్తనను అడ్డుకోవాలని సారయ్య డిజిపి అరవిందరావు సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపిని కోరారు.

విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్‌ ప్రయోగించడంతో తెలంగాణలో లా అండ్ అర్డర్ సమస్య తలెత్తుతుందని అన్నారు. పోలీసులు విద్యార్థులపై కవ్వింపు చర్యలకు, రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి చర్యలకు పోలీసులు పాల్పడకుండా చూడాలని డిజిపికి సూచించారు. పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల తీరు అభినందనీయమన్నారు. వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రం దృష్టికి సమర్థవంతంగా తీసుకు వెళ్లారని చెప్పారు.

English summary
Miniser Baswaraj Saraiah said they will write a letter to AICC president Sonia Gandhi on Telangana issue. He said they 
 
 will urg Sonia to commit forDecember 9th statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X