చంద్రబాబు హెరిటేజ్‌పై తెలంగాణవాదుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బంద్ పిలుపులో భాగంగా పలువురు తెలంగాణవాదులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ దుకాణంపై దాడి చేశారు. రాజధానిలోని సైనిక్‌పురిలోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ దుకాణంపైన పలువురు తెలంగాణవాదులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో దుకాణం అద్దాలు, ర్యాకులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తెలంగాణలోని పది జిల్లాల్లో తెలంగాణవాదులు వివిద రకాల్లో బంద్‌లో తమ తమ నిరసనను తెలియజేశారు. మౌలాలీ స్టేషన్‌లో రైల్ రోకో నిర్వహించారు. రేపల్లే రైలును ఆపి వేశారు. హైదరాబాద్ శివార్లలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. జీడిమెట్లలో 1100 పరిశ్రమలు, చర్లపల్లిలో 500 పరిశ్రమలు, నాచారం, మల్లాపూర్‌లో 250, ఉప్పల్‌లో 230, కుషాయిగూడలో 100కు పైగా కంపెనీలు మూతపడ్డాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో బిహెచ్ఇఎల్‌లో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. బిడిఎల్ ఉద్యోగులు కూడా సుమారు 2వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలోని పలు కార్యాలయ గదులకు తాళాలు వేశారు. చిట్యాల అయిల్ మిల్లుపై దాడి చేశారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో పెట్రోల్ బంక్‌పై దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రా అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సింగరేణి కార్మికులు హోమం చేశారు.
Telanganites attacked on Telugudesam Party president Chandrababu Naidu's Heritage Super Market in Sainikpuri on wednesdasy. They destroyed furniture. Many companies were closed in Hyderabad and Rangareddy districts during Telangana bandh.
Story first published: Wednesday, February 23, 2011, 11:56 [IST]