తెలంగాణపై మార్చి 1తర్వాత తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్

తెలంగాణపై తమకు ప్రతిపక్షాలన్నీ సహకరించాయని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటి రోజు జెపిసి కోసం సహకరించాలని ప్రతిపక్షాలు అడిగాయని, ఆ తర్వాత తెలంగాణపై మీతో ఉంటామని చెప్పారని, దాంతో మొదటి రోజు తాము తెలంగాణపై పట్టుబట్టలేదని ఆయన వివరించారు. తెలంగాణపై పూర్తి స్థాయిలో పార్లమెంటును స్తంభింపజేద్దామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదన ముగిసే వరకు ఆగాలని తమను ఎన్‌డిఎ కోరిందని, దాంతో తాము ఆ తర్వాతే తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications