హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్‌తో చంద్రబాబు కూడా లబ్ధి పొందారు: కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల వల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా లబ్ధి పొందారని మాజీ మంత్రి, వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ వైయస్ వల్ల ప్రయోజనం పొందారని, చంద్రబాబు కూడా లబ్ధి పొందారని, యాభై రూపాయల సబ్సిడీతో చంద్రబాబు ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ పోతోందని ఆమె అన్నారు. వైయస్ జగన్ దీక్ష ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు. వైయస్ జగన్ దీక్ష సందర్భంగా చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆమె విమర్శించారు.

తమను శాసనసభలో ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, వారి పేర్లు తాను చెప్పబోనని, తాము వారికి హెచ్చరికలు చేశామని, మీడియా ముందు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండని చెప్పామని ఆమె అన్నారు. ఏ తప్పు చేయని వైయస్సార్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను ప్రజలు సహించరని ఆమె అన్నారు. తమను ఇబ్బంది పెడితే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని ఆమె కాంగ్రెసు నాయకులను హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో భూస్థాపితమైందని ఆమె అన్నారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఇక అధికారంలోకి రాబోవని, ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు రెండు పార్లమెంటు సీట్లు వచ్చినా చరిత్ర సృష్టించనట్లేనని ఆమె అన్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌ను మర్చిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వర్గం, తెలుగుదేశం పార్టీ, తెరాస గొడవలు చేస్తుంటే, శాసనసభను నడవనివ్వని పరిస్థితి ఉంటే బడ్జెట్‌ను ప్రతిపాదించామని ప్రభుత్వం అనిపించుకుందని, అయితే ఆ బడ్జెట్ ప్రజలకు మేలు చేసేది కాదని ఆమె అన్నారు. వైయస్సార్‌ మాదిరిగా రాష్ట ప్రజలందరినీ ప్రభావితం చేయగల నాయకులు లేరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నాయకత్వ లక్షణాల వల్లనే వైయస్సార్ పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో నాయకత్వ పటిమ, విశ్వసనీయతను కలిగించే నాయకుడు లేడని ఆయన అన్నారు. వైయస్ జగన్ లాంటి నాయకుడు అవసరమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు.

English summary
YS Jagan camp MLA Konda Surekha sais that TDP president Chandrababu is also benifited with YSR schemes. She 
 
 said that Chandrababi is getting subsidy gas cylender due to YSR schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X