తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
|
రాజమండ్రి: తూర్పు గోదావరిలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందటం ఘోర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద ఓ ఆర్టీసి బస్సు - ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న వారు మృతి చెందారు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మృతి చెందిన ముగ్గురూ మహిళలే. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి.
కాగా తీవ్ర గాయాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా పోలీసులు ఈ ప్రమాదం కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Three women dead in an accident in East Godavari district today. RTC bus collided with auto near Mahipala Cheruvu of Mummidivaram mandal in East Godavari district.
Story first published: Thursday, February 24, 2011, 11:35 [IST]