తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తిన శోభానాగిరెడ్డి

ప్రతి విషయాన్నీ రాజకీయ లబ్ధికి వాడుకోవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని ఆమె విమర్శించారు. వైయస్ జగన్ దీక్షకు ప్రభుత్వం స్పందించకున్నా ప్రజలు స్పందిస్తున్నారని ఆమె అన్నారు. వైయస్సార్ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిస్తే వైయస్ జగన్ పోరాటం చేస్తారని ఆమె చెప్పారు. వైయస్సార్‌ను మరిచిపోయేలా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో కొత్త పథకాలు తెస్తుందేమోనని తాను అనుకున్నానని, అయితే అలాంటిదేమీ చేయలేదని ఆమె అన్నారు. బడ్జెట్‌ను సవరించి ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం మరిన్ని నిధులను కేటాయించాలని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
కళ్లుండి చూడలేని ప్రభుత్వం ఇది అని, చెవులుండీ వినలేని ప్రభుత్వమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓ మహానాయకుడి కుమారుడు వైయస్ జగన్ దీక్ష చేస్తుంటే తెలియదని ఓ మంత్రి అంటున్నారని ఆమె అన్నారు. దీక్షను చూస్తే జగన్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఆమె అన్నారు. మంత్రులనైనా ప్రతినిధులుగా పంపాల్సి ఉండిందని ఆమె అన్నారు. మంత్రులకు జగన్ కళ్లలోకి చూసే ధైర్యం ఉండకపోవచ్చునని ఆమె అన్నారు. అధికారులనైనా పంపించి దీక్ష విరమింపజేయాలని అడిగి ఉంటే ప్రభుత్వానికి గౌరవంగా ఉండేదని ఆమె అన్నారు. ప్రజలు జగన్‌ను అర్థం చేసుకున్నారని, ప్రజలే న్యాయనిర్ణేతలని ఆయన అన్నారు. ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే జగన్ వైపు వెళ్తున్నారు, ఎలా వెనక్కి తెప్పించుకోవాలనే దృష్టితోనే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఆమె అన్నారు.