ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం: భారీగా ట్రాఫిక్ జాం
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను పలువురు తెలంగాణవాదులు హైదరాబాద్‌లో గురువారం దగ్ధం చేశారు. లగడపాటి దిష్టిబొమ్మతో అంతకుముందు ర్యాలీ తీశారు. అనంతరం ఖైరతాబాద్‌లోని షాదాన్ కళాశాల దగ్గర ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ నినదించారు. బుధవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా సీమాంధ్రకు చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా కరపత్రాలను పంచి పెట్టడాన్ని వారు ఖండించారు. తెలంగాణ ఇస్తే 24 రాష్ట్రాల డిమాండ్ వస్తుందనే సీమాంధ్రుల మాటలను కొట్టి పారేశారు. తెలంగాణ 56 ఏళ్ల కల అని అన్నారు. అయినా చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని సూచించారు.
లగడపాటి రాజగోపాల్ మొదటినుండి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపించారు. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే లగడపాటి ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణకు కేంద్రం వెనక్కు వెళితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దెబ్బతింటుందని హెచ్చరించారు. కాగా ఈ కారణంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది.
Telanganites burnt Vijayawada Parliament Member Lagadapati Rajagopal effigy at Shadan college in Hyderabad on thursday morning. They gave slogans against Lagadapati. They opposed Seemandhra MPs pomphlet distribution in Parliament.
Story first published: Thursday, February 24, 2011, 11:19 [IST]