ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్లు, కొత్త రైల్వే లైన్లు ప్రకటించిన మమత
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: హైదరాబాద్, సికింద్రాబాద్ రెండోదశ ఎంఎంటిఎస్‌ను వ్యవస్థ అభివృద్ధి ఉంటుందని రైల్వేశాఖమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సమీకృత సబర్బన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కత్తాలలో కూడా సబర్బన్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జైపూర్ - ఢిల్లీ, అహ్మదాబాద్ - ముంబై మధ్య డబుల్ డెక్కర్ ఎసి రైళ్లు ఉంటాయని చెప్పారు. మహిళలకు 58 సంవత్సరాలకు, పురుషులకు 62 ఏళ్లకు సీనియర్ సిటిజన్లుగా గుర్తింపు ఇస్తున్నట్లు చెప్పారు. చెన్నై సబర్బన్ పరిధిలో 10, ముంబైకి 47 కొత్త రైళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. చైన్నై నుండి చెంగల్ పట్టుకు సబర్బన్ రైలు ఏర్పాటు, దేసంలో కొత్తగా 15 దురంతో రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మూడు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశ పెడుతున్నారు.
- హైదరాబాద్‌కు కొత్తగా 5 సబర్బన్ రైళ్లు
- పుణే - సికిందరాబాద్ మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్ - విశాఖ మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్
- విశాఖ - కోరాట్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
- హౌరా తిరుపతి - విశాఖ మధ్య ఎక్స్ ప్రేస్
- తిరుపతి - గుంతకల్ మధ్య ప్యాసింజర్
- కాచిగుడ - నడికుడి మధ్య ప్యాసింజర్
- కాచిగూడ- మిర్యాలగూడ ప్యాసింజర్
- ఫలక్‌నుమా - మేడ్చల్ ప్యాసింజర్
- సికింద్రాబాద్ - నిజామాబాద్ మధ్య ప్యాసింజర్
- నర్సాపూర్ - నాగర్‌సోల్ మధ్య ప్యాసింజర్ హైదరాబాద్ మీదుగా
- హైదరాబాద్ - వాడి ప్యాసింజర్
- కొత్త లైన్లు -
- తిరుపతి - అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్
- హౌరా - సికిందరబాద్
- కరీంనగర్ - హసన్‌పర్తి
- భద్రాచలం -విశాఖ
- దొనకొండ - ద్రోణాచలం
- పటాన్ చెరు - అదిలాబాద్
- భద్రాచలం - ఖరగ్ పూర్
- తిరుపతి - కాంచీపురం - నాగుర్ కొత్త లైన్లు
- మహానంది మీదుగా కర్నూలు - నంద్యాల - అత్మకూరు
- పిడుగురాళ్ల - రేణిగుంట
- సిద్దిపేట - హైదరాబాద్ - కరీంనగర్
- మేళ్లచేరువు - జానపాడు
- నడికుడి - శ్రీకాళహస్తి
- హైదరాబాద్ - శ్రీశైలం
Railway Minister Mamata Banerjee proposed new railway lines and new passengers and expresses to Andhra Pradesh in railway budget. Shatabdi Express proposed between Hyderabad and Pune.
Story first published: Friday, February 25, 2011, 14:06 [IST]