రైల్వే బడ్జెట్: వరంగల్ జిల్లా ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సింగూరులో కొత్త కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముంబై, చెన్నై, కోల్‌కత్తాల్లో రైల్వే ట్రాక్ పక్కన నివసించేవారికి ఉచిత ఆవాసాలు నిర్మించి ఇస్తామని ఆమె చెప్పారు. రైల్వే రిజర్వేషన్ బుకింగ్ చార్జీలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు. రైల్వేలోని బలహీన వర్గాలవారి పిల్లలకు విద్య కోసం నెలక 1200 రూపాయల ఉపకారవేతనం ఇస్తామని ఆమె చెప్పారు. ప్రత్యేక క్రీడా క్యాడర్ ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న సమయంలో మధ్యలో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆమె ప్రసంగాన్ని ఆపేశారు.












Click it and Unblock the Notifications