వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాఫ్ట్‌వేర్‌కు ప్రణబ్ మొండిచేయి, ఎన్నారైలకు రూ. 81 కోట్లు

కాగా, ప్రవాస భారతీయులకు 2011-12 బడ్జెట్‌లో భారీ వరాలేమీ కురిపించలేదు. గత ఏడాది కేటాయించిన మొత్తానికి రూ.8 కోట్లు అదనంగా చేర్చి రూ.81 కోట్లు కేటాయించారు. 2010-11 బడ్జెట్‌లో ఎన్నారైలకు రూ.73 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.6 కోట్లను 'ప్రవాస భారతీయ దివస్" వేడుకల కోసం పద్దు చూపారు. ఈ ఏడాది ఆరంభంలో, జనవరి 7,8,9 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రవాస భారతీయ దివస్ వేడుకలు జరిగిన తెలిసిందే. ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో లెక్కచూపారు. ఈ పద్దు పోను మిగిలిన రూ.75 కోట్ల బడ్జెట్‌లో ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ అవసరాల నిమిత్తం రూ.47.50 కోట్లను కేటాయించారు. ఇవన్నీ పోను ప్రవాస భారతీయుల సంక్షేమ కార్యక్రమాల కోసం ఉదారంగా రూ.9.20 కోట్లు ప్రతిపాదించారు.