హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకరపల్లి కాల్పులపై దద్ధరిల్లిన అసెంబ్లీ, ఎల్లుండికి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి కాల్పుల ఘటనపై మంగళవారం శాసనసభ దద్ధరిల్లింది. ఈ సంఘటనపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇదే ఘటనపై తొలుత 15 నిమిషాల పాటు వాయిదా పడిన సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా కార్యక్రమాలేవీ చేపట్టకుండానే ఎల్లుండికి వాయిదా పడింది. ప్రతిపక్షాల గందరగోళం మధ్యనే కాకరాపల్లి ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై, కాకరాపల్లి ఘటనపై చర్చించాలని తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, బిజెపి సభ్యులు పట్టుబట్టారు. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణపై చర్చించాలని మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.

తాము ఏ అంశం మీద అయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, ఏ అంశంపై చర్చ జరపాలో ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్ది చెప్పినా ప్రతిపక్షాలు వినలేదు. దీంతో ఆయన సభను ఎల్లుండికి వాయిదా వేశారు. కాగా, తెలంగాణ అంశంపై శాసనమండలిలో రభస జరిగింది. తెలంగాణ అంశంపై చర్చించాలని తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలను వాయిదా వేశారు.

English summary
As Srikakulam district Kakarapalli police firing incident rocked, assembly adjourned for day after tomorrow. Legislative Council also adjourned on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X