తెలంగాణ పరిష్కారం చంద్రబాబు చేతుల్లోనే ఉంది: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతుల్లోనే ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కొంత సమయం పట్టవచ్చునని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్లనే తెలంగాణ సమస్య జఠిలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ పూటకో మాట మాట్లాడుతోందని ఆయన అన్నారు. 34 శాతం ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా గౌరవించి విస్మరించకూడదని కాంగ్రెసు పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర కోసం శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తమ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదన గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. ఈ నెల 5వ తేదీన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో జరిగే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశానికి తనకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు. ప్రకటించిన ప్యాకేజీ ఇవ్వకపోవడం పల్లనే శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పారు. ప్యాకేజీని ఇవ్వని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు చేసే పనులు ప్రభుత్వానికి అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు. కాకరాపల్లి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. కాకరాపల్లి బాధితులకు యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+